TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీవన విధానంలో యోగా భాగం కావాలి.. హోంమంత్రి అనిత

Published on: Sat May 24, 2025 1:18PM

జీవన విధానంలో యోగా భాగం కావాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విశాఖ రానున్న నేపథయంలో సన్నాహక కార్యక్రమాలను కూడా ఘటనంగా నిర్వహిస్తున్నారు.  విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం యోగాంధ్ర కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నివిశాఖలో నిర్వహించడం గర్వకారణమన్నారు.  యోగా   శరీరానికీ, మనసుకూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి నేతలు   ఎనర్జిటిక్‌గా ఉండటానికి యోగాయే కారణమన్న అనిత..   ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక గంట యోగానికి సమయం కేటాయిస్తే..  రోజంతా ఉత్సహంగా గడిపేందుకు వీలుంటుందన్నారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి,ప్రభుత్వ విప్ గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి,అధికారులు పాల్గొన్నారు.