TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యోయో హనీ సింగ్‌ బతికే వున్నాడు..!

Published on: Tue Jun 3, 2014 4:51PM

 

 

 

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా వార్త పోస్ట్ చేశారంటే ఆ వార్త క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త గుప్పుమంది. అదేంటంటే, ప్రముఖ సింగర్ యోయో సింగ్ యాక్సిడెంట్‌కి గురయ్యాడని, ఆ ప్రమాదంలో యోయో సింగ్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ వార్తతోపాటు హాస్పిటల్‌లో వున్న ఒక పేషెంట్ ఫొటో కూడా ప్రపంచం మొత్తం చుట్టేసింది. సదరు ఫొటో మసగ్గా వుండేసరికి చాలామంది పాపం యోయో సింగ్ చనిపోయాడని అనుకున్నారు. మనసులో యోయో సింగ్‌కి శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు. కొంతమంది అయితే సంతాప సభలు కూడా ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపించారు. ఈ పుకారు అలా అలా ప్రయాణించి చివరికి యోయో సింగ్‌కి చేరింది. యోయో సింగ్ కూడా తనకు తాను సంతాపం ప్రకటించుకోబోయి, తాను బతికే వున్న విషయం, తనకు ఏ యాక్సిడెంటూ కాని విషయం గుర్తుకొచ్చి నాలుక్కరుచుకున్నాడు. ఈ పుకార్లని ఇక్కడితో ఖండించకపోతే పరిస్థితి ఇంకా డేంజరయ్యే అవకాశం వుందని తాను ట్వి్ట్టర్‌లోకి లైన్లోకి వచ్చాడు. నాకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు, నేను బతికే వున్నాను. నమ్మండి ప్లీజ్ అంటు ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేశాడు. పాపం యోయో సింగ్‌కి ఇదెక్కడి ఖర్మ?