TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో ఆగని దాడులు.. మరో ఆలయంలో విగ్రహాల ధ్వంసం!

Published on: Sat Jan 2, 2021 3:56PM

ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ని నెలలుగా ఎన్నో దేవాలయాలపై దాడుల జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ వచ్చింది. పదులు వందల సంఖ్యలో దాడులు జరిగిన తర్వాత గానీ ముఖ్యమంత్రి జగన్ స్పందించలేదు. ఇటీవల ఆయన హిందూ దేవాలయాలపై దాడుల అంశంపై మాట్లాడుతూ.. దేవుడితో పెట్టుకుంటే కఠినంగా శిక్షిస్తాడని హెచ్చరించారు. కానీ ఏం లాభం? ఆయన హెచ్చరించినా దుండగులు రెచ్చిపోతున్నారు. ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రామతీర్థం, రాజమండ్రి ఘటనలు మరువకముందే.. తాజాగా కర్నూలు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.

 

కర్నూలు జిల్లాలోని కోసిగి మండలం మర్లబండలోని ఆంజనేయస్వామి ఆలయంలో సీతారాముల విగ్రహాలను ధ్వంసం చేశారు. గోపురంపై ఉన్న విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంతేగాక ఆలయంలోని హుండీలను కూడా అపహరించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.