కేసిఆర్ కు ఎర్రబెల్లి సవాల్
Published on: Thu May 3, 2012 10:31AM
తెలంగాణా రాష్ట్రసమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావును తెలంగాణా టిడిపి ఫోరం కన్వీనర్, ఎమ్మెల్యే అయిన ఎర్రబెల్లి దయాకరరావు ఘాటుగా విమర్శిస్తున్నారు. కేసిఆర్ జగన్ తో కుమ్ముక్కై అధికారాన్ని పంచుకోవాలని చూస్తున్నారే తప్ప తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు నిజాయితీగా ఉద్యమించటం లేదన్నారు. కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పరకాల ఉపఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలపాలని సవాల్ విసిరారు. తెలంగాణా జెఎసి ఏ అభ్యర్థిని నిలబెడితే ఆ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని, టి.ఆర్.ఎస్. కూడా ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వ్లాలని ఆయన డిమాండ్ చేశారు. టి.ఆర్.ఎస్. రంగంలో ఉంటే టిడిపి అభ్యర్థి కూడా పోటీలో ఉంటాడని, బిజెపి అభ్యర్థి కూడా పోటీ చేస్తే తెలంగాణావాద ఓటర్లలో చీలిక వస్తుందని యర్రబెల్లి హెచ్కాహ్రించారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలన్నారు.


