TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సిబిఐ దర్యాప్తును స్వాగతించిన యడ్యూరప్ప

Published on: Sat May 12, 2012 9:40AM

అక్రమ మైనింగ్‌ విషయంలో, తన కుటుంబ ఛారిటీ సంస్థకు అక్రమంగా విరాళాలు వసూలు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడాన్ని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వాగతించారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 2000 సంవత్సరం నుంచి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని తాను ప్రధాన మంత్రిని కోరుతున్నానని ఆయన అన్నారు. మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అక్రమ మైనింగ్‌ను అడ్డుకున్న తనపైనే అక్రమ మైనింగ్‌ ప్రోత్సహించాననే అపవాదు వేశారని, ''ఇది రాజకీయ కుట్ర'' దీన్నుంచి ఎలా బయట పడాలో తనకు తెలుసు అని అన్నారు. ఏది ఏమైనా, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సదా నందగౌడ మాట్లాడుతూ, యడ్యూరప్ప ఎలాంటి మచ్చ లేకుండా బయట పడగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. యడ్యూరప్పపై వచ్చిన ఈ ఆరోప ణలను హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.