పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం..
Published on: Wed Mar 22, 2017 10:17AM
.jpg)
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్ధి వెన్నపూస గోపాల్ రెడ్డి విజయం సాధించాడు. టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం సాధించగా పశ్చిమ రాయలసీమను వైసీపీ సొంతం చేసుకుంది. ఈ సందర్బంగా వైసీపీ నేతలు పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించారు. ఇది నిజమైన ప్రజా తీర్పు అని నేతలు అభివర్ణించారు.


