TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కల్యాణ్ ను వదిలేసి.. తెలుగుదేశం టార్గెట్.. వైసీపీ వ్యూహమేంటి?

Published on: Wed Aug 12, 2026 12:30PM

గత ఎన్నికలకు ముందు అంటే 2024 ఎన్నికలకు ముందు వరకూ జగన్ తన విమర్శలను పవన్ కల్యాణ్ పై ఎక్కు పెట్టారు. అందరూ వ్యతిరేకిస్తున్నా.. పవన్ వ్యక్తిగత వ్యవహారాలను తరచురగా ప్రస్తావిస్తూ వచ్చే వారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగుదేశం కూటమిలో మూడు పార్టీలు ఉంటే.. వాటిలో రెండింటిని వదిలేసి వైసీపీ ఇప్పుడు కేవలం తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేసుకుని విమర్శలు సంధిస్తోంది. ఆరోపణలు గుప్పిస్తోంది. ఇందుకు కారణం ఏంటి? వైసీపీ వ్యూహం ఏంటి?  అన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పార్టీని మాత్రమే టార్గోట్ చేసింది.  ప్రభుత్వంలో  నిర్ణయాలను తూర్పారపడుతూ చేస్తున్న విమర్శల్లోనూ, ఏదైనా సమస్య ఉత్పన్నమైతే.. కూటమిలో తెలుగుదేశం తరువాత పెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేననూ, బీజేపీనీ వదిలేసి తెలుగుదేశం పార్టీపైనే విమర్శలు గుప్పిస్తోంది.  

వైసీపీ అధినేత సహా ఆ పార్టీ  నేతలు  చంద్రబాబు, లోకేష్, అలాగే తెలుగుదేశం మంత్రులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. జనసేన పైనా, ఆ పార్టీకి చెందిన మంత్రులపైనా ఎటువంటి విమర్శలూ వైసీపీ నుంచి రావడం లేదు.   ప్రస్తుతం పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు కీలక మంత్రిత్వ శాఖలు చూస్తున్నారు. అయితే వారి శాఖలకు సంబంధించిన అంశాలపై విమర్శలు గుప్పించాలన్న వైసీపీ తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీకి చెందిన మంత్రులనే టార్గెట్ చేసుకుంటోంది.  

  
2024 ఎన్నికల్లో పవన్‌ను టార్గెట్ చేసిన తీరు వైసీపీకి రాజకీయంగా నష్టం చేసిందని వైసీసీ భావిస్తోంది. అందుకు విమర్శల జోలికి పోకుండా ఉంటేనే బెటర్ అని భావిస్తోంది. అంతకు మించి.. ఒకే సారి జనసేన, తెలుగుదేశంలు టార్గెట్ గా ముందుకు వెడితో.. ఒకే సారి ఇద్దరు ప్రత్యర్థులతో తలపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీకి అంత బలం, శక్తి, క్యాడర్, నాయకత్వం కూడా లేదు. అందుకు ఉన్న పరిమితుల్లోనే తెలుగుదేశం పార్టీని టార్గోట్ చేస్తే.. వచ్చే ఎన్నికల నాటికి జనసేన నుంచి వైసీపీ టార్గెట్ గా విమర్శల తీవ్రత పెద్దగా ఉండదని వైసీపీ భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

జనసేనకు ఉన్న సామాజిక, రాజకీయ ప్రభావాన్ని వైసీపీ ఇప్పుడు మరింత జాగ్రత్తగా చూస్తోందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.అలాగే వచ్చే ఎన్నికల  నాటికి కూటమి ఇన్ టాక్ట్ గా ఉన్న పరిస్థితి తెలుగుదేశం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోతుందని వైసీపీ భావిస్తుంది. అప్పుడు ఎన్నికలలో కూటమిగా మూడు పార్టీలూ కలిసి పోటీ చేసినా.. కూటమి ఇంపాక్ట్ కంటే తెలుగుదేశం, వైసీపీ వార్ అన్న ఇంపాక్టే ఉంటుందని, అది తమకు రాజకీయంగా లబ్ధి చేకూరుస్తుందని బీజేపీ భావిస్తున్నట్లుగా పరిశీలకులు అంటున్నారు.