TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డ్వాక్రా మహిళలు ఒళ్లు బరువెక్కి కొట్టుకుంటున్నారు.. వైసీసీ సర్పంచ్ అరాచ‌కం

Published on: Sat Dec 11, 2021 3:11PM

ఏపీలో మ‌హిళ‌ల‌కు గౌర‌వం లేకుండా పోయింది. ఓవైపు మ‌హిళ‌ల‌పై వ‌రుస దాడులు, అఘాయిత్యాలు జ‌రుగుతుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లు మ‌హిళ‌ల‌ను చుల‌క‌న‌గా మాట్లాడుతున్నారు. మ‌హిళ‌ల‌తో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేల అస‌భ్య ఫోన్‌కాల్స్ వైర‌ల్ కావ‌డం మ‌రింత దారుణం. ఇక కొడాలి నాని లాంటి వాళ్లైతే.. అమ్మ మొగుడులాంటి బూతులు మాట్లాడ‌టానికి ఏమాత్రం వెన‌కాడ‌రు. వైసీపీ పెద్ద‌ల‌నే ఆద‌ర్శంగా తీసుకున్నారో ఏమో.. తాజాగా ఓ వైసీపీ స‌ర్పంచ్ డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఉద్దేశించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. 

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిషత్‌ సమావేశంలో కొత్తమల్లాయపాలెం వైసీసీ సర్పంచ్‌ కుందూరి లక్ష్మారెడ్డి మహిళలపై చేసిన వాఖ్యలు కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. ఓ సమావేశానికి హోంమంత్రి సుచరిత వచ్చి వెళ్లిన తర్వాత శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన వీవోఏల అవినీతి అంశంపై చర్చ జరిగింది. యానిమేటర్లు చేసిన అవినీతి, వారి తొలగింపుపై ఓ అధికారి మాట్లాడుతుండ‌గా.. అలాంటి వారిని ఎందుకు తొలగించడంలేదని కొందరు ప్రశ్నించారు. 

స‌ర్పంచ్‌ లక్ష్మారెడ్డి కలగజేసుకుని "మహిళలు ఒళ్లు బరువెక్కి కొట్టుకుంటున్నారు. వారే బ్యాంకులకు వెళ్లి డబ్బు వేయకుండా వీవోఏలకు ఎందుకిస్తున్నారు? వీవోఏలు అవినీతి చేసినా మేం సపోర్టుగా ఉంటాం. మా ఓటు బ్యాంకులు వారైతే.. వారిపై ఎలా చర్యలు తీసుకోగలం" అంటూ మాట్లాడటంతో ఒక్క‌సారిగా అక్క‌డున్న వారంతా అవాక్క‌య్యారు. స‌ర్పంచ్ ల‌క్ష్మారెడ్డి వ్యాఖ్య‌లు వైర‌ల్ కావ‌డంతో.. అంతా ఆయ‌న‌పై మండిప‌డుతున్నారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మ‌హిళ‌లంటే వైసీపీ నాయ‌కుల‌కు ఏమాత్రం మ‌ర్యాద లేదంటూ తిట్టిపోస్తున్నారు.