TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రేపు వైసీపీ అవిశ్వాస తీర్మానం... పవన్ అప్పుడు ఫోన్ చేశాడు...

Published on: Thu Mar 15, 2018 1:21PM

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పినసంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే రేపు వైసీపీ అవిశ్వాస తీర్మానం పెట్టబోతోంది. దీనిలో భాగంగానే.... అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకాలని కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. అన్ని పార్టీలతో పాటు టీడీపీకి కూడా లేఖ రాయబోతోంది. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని నేపథ్యంలో, తాము పెడుతున్న అవిశ్వాస తీర్మానికి టీడీపీ కూడా మద్దతు పలకాలని లేఖలో కోరనుందని... అవసరమైతే రాజీనామాలు చేసేందుకు కూడా వైసీపీ రెడీ అయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. 

 

ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇన్ని రోజుల నుండి పోరాటం చేస్తున్నా.. కనీసం సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని.. అందుకే రేపే అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నామని చెప్పారు. దీనికి అన్ని పార్టీల మద్దతు కావాలని అన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ టీడీపీ పై చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించి...  నాలుగేళ్లుగా హోదాపై మాట్లాడని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికైనా మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు. హోదాకోసం పోరాడితే పవన్ కు మద్దతిస్తాం... హోదాపై జనసేన, వైసీపీ కలిపే పోరాడతామని అన్నారు. ఇంకా ఒకరోజు పవన్ ఫోన్ చేసి కలవాలంటే కలిశాను.. అప్పుడు వైసీపీ నేతలు నన్నేందుకు విమర్శిస్తున్నారని అడిగారు.. దానికి మీరు టీడీపీకి వంత పాడుతున్నారు కాబట్టే విమర్శిస్తున్నాం అని చెప్పాను.. నేను టీడీపీ తో లేను అవసరమైతే జగన్ కు మద్దతిస్తాను అని చెప్పారని తెలిపారు. అందరం కలిసి పోరాడితే కేంద్రం దిగొస్తుందని అన్నారు.