ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్..

 

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్దిపై చర్చలకు రావాలంటూ టీడీపీ నాయకులు సవాల్ విసరడం, అందుకు ‘సరే’ అంటూ వైసీపీ ఎంపీఅవినాష్ రెడ్డి  ప్రతి సవాల్ విసరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పులివెందులలో చర్చకు రెండు పార్టీలు స సిద్ధపడ్డాయి. దీనిలో భాగంగానే రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఇరుపార్టీల నేతలు ఎదురుపడితే ఘర్షణలు తలెత్తే అవకాశాలుండటంతో పులివెందులలో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు.  అంతేకాదు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్టు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, టీడీపీ కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటే కుదరని, పులివెందుల కోసం ఎవరు ఏం చేశారో తేలాలని అన్నారు.