ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేల దందా... మరీ ఇంత దారుణమా!!

 

ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ మొదలు పెడుతున్నారు అని అందరికి చేరువవుతున్న విషయం. ఏ వ్యాపారమైనా సరే కప్పం కట్టాల్సిందే నని హుకుం జారీ చేశారని, వారిని బెదిరింపులతో దారిలోకి తెచ్చు కుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వ్యాపారాలూ కాంట్రాక్టులు ఇసుక ఇతరాత్ర లావాదేవీల సాధారణంగా అధికార పార్టీ ఎమ్మెల్యే లకు ఇవే ఆర్ధిక వనరులు. కానీ కొందరు ఎమ్మెల్యే లు మరీ చెలరేగిపోతున్నారు. నాలుగు నెలల్లోనే నియోజక వర్గ ప్రజలు అమ్మో అని బెదిరిపోయేలా చేస్తున్నారు. చిన్నా చితక పోస్టుల విక్రయం నుంచి కోట్ల విలువ చేసే భూముల సెంటిమెంట్ల దాక అన్ని దారులల్లో చెలరేగిపోతున్నారు. మరికొందరేమో విగ్రహావిష్కరణ నుంచి పోస్టింగ్ ల దాకా ఏదైనా తమ కనుసన్నలలోనే జరగాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేల తీరు తీవ్ర చర్చ నీయాంశంగా మారింది. 

పశ్చిమ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్యే బ్రాందీ షాపులో పని చేసే ఉద్యోగాలను కూడా అమ్ము కున్నట్టు సమాచారం. ఒక్కో ఉద్యోగానికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసినట్టు తెలుస్తోంది. విద్యుత్ శాఖలో వుండే కొన్ని పోస్టులు ఆరు లక్షల రూపాయలకు భారం పెట్టేశారు. ఇదే కాదు ఏ చిన్నపోస్టు ఉన్న ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇంకో విచిత్రమైన విషయమేమిటంటే తాము చెప్పిన మొత్తం ఇస్తామని ఒప్పుకున్న వారిని పిలిపించుకుని అందరి సెల్ ఫోన్ లు బయటపెట్టించి వ్యవహారం సెటిల్ చేశారు. 

గుంటూరు జిల్లాలో కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే లు బ్రాందిషాపుల్లో పోస్టులతో సహా చిన్న చిన్న వాటిని కూడా వదలకుండా విక్రయించుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ పోస్ట్ యాభై వేలకు అమ్మినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ముఖ్య అనుచరులు ఈ పనిని చక్కదిద్దేశారు అని సమాచారం. గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే బిజినెస్ మెన్ తరహా రాజకీయం చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యాపార వర్గమైన తనతో మాట్లాడి సెటిల్ చేసుకోవాల్సిందేనన్న షరతు పెట్టారు. గ్రానైట్ క్వారీల నుంచి నియోజకవర్గస్థాయి సంతల వరకు ప్రతి వ్యాపార వర్గాన్ని పిలిచి నెలకు ఇంత అని మాట్లాడుకున్నట్లు తెలిసింది. సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. 

గుంటూరు జిల్లా కు చెందిన ఒక ఎమ్మెల్యే విగ్రహాల పైన కూడా ప్రతాపం చూపిస్తున్నారు. తమ గ్రామం లో ఫలానా నాయకుడు విగ్రహం పలానా కూడలి లో పెడుతున్నారట కదా పెట్టేందుకు వీల్లేదు అంటూ విగ్రహ ఆవిష్కరణ కోసం కట్టిన దిమ్మెను కూడా కూల్చి వేయించినట్టు తెలిసింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక నిర్వాహకులు ఒక ప్రైవేటు స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఆ ఎమ్మెల్యే వదల్లేదు. ఆ ప్రైవేటు స్థలం యజమాని ఎవరో తెలుసుకొని ఆయన కు ఫోన్ చేసి విగ్రహం పెట్టేందుకు అనుమతించనందుకు మీ సంగతి చూస్తాను అంటూ బెదిరించినట్లు తెలిసింది. 

అనంతపురం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సెటిల్ మెంట్ ల వ్యవహారం మొదలుపెట్టినట్లు సమాచారం. ఒక ఎమ్మెల్యే ఎక్కడైనా భూ వివాదం ఉంటే అది చక్కబెట్టేస్తాను అంటూ దిగుతారు, లేకుంటే వారే తన దగ్గర కు వివాద పరిష్కారం కోసం వచ్చేలా చేస్తారు. ఇక అక్కడ కు వెళ్లాక ముందు గా ఆ స్థలం లో తనకు కొంత రాసివ్వాలి అంటూ అడుగుతున్నారని సమాచారం. ఇలా ఇప్పటికే కొన్ని స్థలా లు తమ వారి పేరు మీద రాయించుకొని ఆ తర్వాత వివాదాల సెటిల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన తన నియోజక వర్గం దాటి అనంతపురం లో కూడా ఈ మేరకు సెటిల్ మెంట్ లు చేస్తున్నారని తప్పని సరి పరిస్థితుల్లో భయంతో అతన్ని మాట వినాల్సి వస్తుంద ని కొందరు వాపోతున్నారు. 

ఇదే జిల్లాలో మరో ఎమ్మెల్యే దెబ్బ కు ఇద్దరు వ్యాపారులు విపరీతమైన భయాందోళనకు గురయ్యారు అని అంటున్నారు. తన నియోజకవర్గంలో ఉన్న ఒక లాడ్జి యజమానిని పిలిచిన ఎమ్మెల్యే భారీ మొత్తం లో డబ్బు డిమాండ్ చేశారని తెలిసింది. అంత మొత్తమా అంటూ ఆ వ్యాపారి భయాందోళనకు గురయ్యారు. ఆ తరువాత కొన్ని రోజులకు సదరు వ్యాపారి చనిపోవడం వెనుక ఈ బెదిరింపు ప్రభావం కూడా ఉన్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని కూడా ఇదే విధంగా బెదిరించినట్టు తెలిసింది. అతను వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ కు అవసరమైన అనుమతులు ఇవ్వాలంటే తనకు ఇంత ఇవ్వాల్సిందే నని హుకుం జారీ చేశారు. పార్టీ కార్యక్రమాలకు విరాళా లు ఇస్తామని ఇలా వెంచర్ వేసినందుకు భారీ మొత్తంలో డబ్బు లు ఇవ్వలేమని చెప్పినా వినకుండా బెదిరింపులకు గురి చేశారని సమాచారం. ఈ ఎమ్మెల్యేల తీరు పై వారి నియోజకవర్గాలతో పాటు పార్టీ లోనూ చర్చ  కొనసాగుతోంది. మరి సీఎం జగన్ ఇప్పటికైనా జాగ్రత్త పడతారా లేదా అనేది వేచి చూడాలి.