వైసీపీ సభ్యుల సారీ.. సస్పెన్షన్ ఎత్తివేత
Published on: Thu Aug 28, 2014 11:04AM
.jpg)
అసెంబ్లీలో గందరగోళం సృష్టించినందుకు, స్పీకర్ ముందు వున్న మైక్‌ని విరగ్గొట్టినందుకు వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, మణిగాంధీలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గురువారం నాడు వీరిద్దరి మీద విధించిన సస్పెన్షన్ వేటును స్పీకర్ కోడెల శివప్రసాదరావు తొలగించారు. ఈ ఇద్దరు సభ్యులూ సభకు క్షమాపణ చెప్పడంతో సస్పెన్షన్‌ని ఎత్తివేశారు.


