ఎమ్మెల్యే రోజా కూతురికి అరుదైన గౌరవం
Published on: Fri Oct 1, 2021 7:13PM
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది . ప్రఖ్యాత ఇన్ఫ్లూఎన్సర్ UK మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించారు. రచయితగా , ఎంట్రప్రెన్యుయర్ గా , ప్రోగ్రామర్‌గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపికైనట్లు ఇన్ఫ్లూఎన్సర్ సంస్థ ప్రకటించింది . దీనిపై స్పందించిన అన్షూ ... తన కల నెలవేరిందని సంతోష పడింది. కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా ఆమె ఫోటో వేశారు.


