TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డాక్టరుగా మారిన ఎమ్మెల్యే రోజా! 

Published on: Sun Dec 19, 2021 7:46PM

సినీ నటి, ఫైర్ బ్రాండ్ లీడర్, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా డాక్టరయ్యారు. చేతిలో స్టెతస్కోప్ పెట్టుకుని పలువురు చిన్నారులను పరీక్షించారు. ఆ తర్వాత తనకు డాక్టర్ అవ్వాలన్న కోరిక ఈ విధంగా తీర్చుకున్నట్టు సరదాగా వ్యాఖ్యానించారు. 

ఆదివారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే రోజా . ఈ సందర్బంగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని పలువురు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ నార్మల్, షుగర్ నార్మల్ అంటూ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.  తనకు చిన్నవయసులో డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉండేదని ఈ సందర్బంగా రోజా అన్నారు. కానీ, డాక్టర్ కాలేక యాక్టర్‌ను అయినట్టు చెప్పారు.

తిరుపతిలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్‌గా తాను పాస్ అయినట్టు చెప్పారు ఎమ్మెల్యే రోజా . ఆ తర్వాత వైద్య సీటు కోసం ప్రవేశ పరీక్ష కూడా రాశానని, కానీ తనకు సినిమాల్లో అవకాశం రావడంతో అన్నీ వదిలేసి ఈ సినిమా రంగంలోకి వెళ్లినట్టు చెప్పారు. రోజా డాక్టర్ గా మారడంతో ఆమెను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.