రోజా మళ్లీ ఏసేసిందిగా....

 

చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మరోసారి తన నోరు విప్పారు. ఇప్పటికీ సస్పెన్స్ గా కొనసాగుతున్న జగన్ పాదయాత్ర విషయంపై ఆమె స్పందించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో రోజా మాట్లాడుతూ...త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేయ‌నున్న పాద‌యాత్ర‌కు అనుమతి వ‌స్తుందా? రాదా? అన్న విష‌యం రెండో విష‌య‌మ‌ని, జ‌గ‌న్ చేయాల‌నుకున్న‌ది చేస్తార‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పాద‌యాత్ర విష‌యం గురించి ఇప్ప‌టికే కోర్టును ఆశ్ర‌యించామ‌ని, శుక్ర‌వారం ఒక్క‌రోజు జ‌గ‌న్‌ కోర్టుకు వెళితే స‌రిపోతుంద‌ని, పాద‌యాత్ర చేయొద్ద‌ని కోర్టు చెప్ప‌ద‌ని.. జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌వంతం అవుతుందని రోజా చెప్పారు. ‘మాకు ప్రజా స‌మ‌స్య‌లు ముఖ్యం, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడాల‌నుకున్నారు. ఆ చిరున‌వ్వు కోస‌మే జ‌గ‌న‌న్న పాటుప‌డుతుంటే, ఆయ‌న చేయ‌ని త‌ప్పుకి ఎన్ని నెల‌లు జైల్లో ఉన్నారో కూడా మీరు చూశారు’ అని రోజా వ్యాఖ్యానించారు.