రోజాకు చేదు అనుభవం.. రోజా గోబ్యాక్ అంటూ నినాదాలు..
Published on: Mon Jan 11, 2016 2:40PM
.jpg)
వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు ఆమె పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో వైసిపి మండల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లగా టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. మంత్రి పీతల సుజాతను రోజా.. సుజాతకు వడ్డాణాలు, డబ్బుల పైన ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల పైన లేదని..ఆమెకు చంద్రబాబు భజన తప్ప ఇంకొకటి తెలియదని ఎద్దేవ చేశారు. ఈ నేపథ్యంలో ఓ దళిత మంత్రిని అవమానపరిచేలా మాట్లాడిన ఆమె క్షమాపణ చెప్పాలని టిడిపి కార్యకర్తలు ధర్నాకు దిగారు. రోజా గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలు కూడా రావడంతో టీడీపీ.. వేసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు అక్కడకి వచ్చి పరిస్థితిని చక్కదిద్ది.. రోజాని వెనక్కి వెళ్లమని సూచించారు.


