టీడీపీ నేత కారులో వైసీపీ ఎమ్మెల్యే....

 

ఇప్పటివరకూ ఎంతో మంది వైసీపీ నేతలు అధికార పార్టీ అయిన టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు మరో నేత జగన్ ఝలక్ ఇవ్వడానికి సిద్దపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనెవరో కాదు... వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా. ముస్తఫా, ఇప్పటి వరకు జగన్ కు నమ్మిన బంటుగా, చెప్పింది చేస్తూ, పార్టీ నిర్మాణనికి కృషి చేస్తూ వచ్చారు..అయితే, ఈ మధ్య జగన్ వైఖరి నచ్చక, అసంతృప్తిగా ఉంటున్నారు. అయితే ఈ రోజు గుంటూరులో ఒమెగా ఆసుపత్రి ప్రారంభోత్సవం నిమిత్తం టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన కారులో అక్కడికి వెళ్లారు. ఇక అక్కడికి వెళ్లని ఆయన చంద్రబాబును కలుసుకున్నారు... ఈ సందర్భంగా ముస్తఫాతో చంద్రబాబు భేటీ అయ్యారు. దీంతో  వైసీపీని ఆయన వీడనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇక ఈ విషయంపై స్పందించిన ముస్తఫా..  నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలవడం జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు ఇచ్చేందుకు ఆయన సుముఖత చూపారని అన్నారు.