TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

జనసేన కార్యకర్తలను తాలిబన్లతో పోల్చిన వైసీపీ ఎమ్మెల్యే

Published on: Fri Sep 3, 2021 3:51PM

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో వైసీపీ, జనసేన మధ్య వివాదం ముదురుతోంది. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు పోస్టులు. బ్యానర్లు వేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేయడంతో వైసీపీ నేతలు అదే స్థాయిలో కౌంటరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జనసేన కార్యకర్తలు, నేతలపై విరుచుకుపడ్డారు. ఎవరైనా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే చాలు... జనసేన కార్యకర్తలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.

భీమవరంలోనే కాదు, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందన్నారు వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. జనసేన కార్యకర్తలకు, తాలిబన్లకు తేడా ఏమీలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఇప్పుడు నేను కొత్తగా చెప్పడం కాదు... జనసేన కార్యకర్తల తీరు గురించి గతంలో అల్లు అర్జున్, నాగబాబు స్వయంగా చెప్పారు. జనసేన నేతలు పిల్లచేష్టలకు పాల్పడుతున్నారు" అని గ్రంథి శ్రీనివాస్ వివరించారు.గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ భీమవరం ప్రజలకు కనిపించలేదని, ఆయన ఎందుకు కనిపించలేదన్న విషయాన్ని జనసేన కార్యకర్తలు ఓ బ్యానర్ వేసి ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని హితవు పలికారు.