అడ్డంగా దొరికిపోయిన చెవిరెడ్డి...
Published on: Thu Sep 25, 2014 10:04AM
.jpg)
వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆర్థికంగా స్థితిమంతుడైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ రాయలసీమలో ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే ఆర్థికంగా ముందుంటారు. అయితే అలాంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డికి పేద ప్రజలకు ఉండాల్సిన తెల్ల రేషన్ కార్డు వుంది. అలాగే సుబ్రహ్మణ్య రెడ్డి ఎంచక్కా నెలనెలా వృద్ధాప్య పెన్షన్ కూడా అందుకుంటున్నారు. కోట్లకు పడగలెత్తిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి తండ్రికి తెల్ల రేషన్ కార్డు (ఏపీ 102600500742) వుండటం, నెలకు నాలుగు వందల రూపాయల రూపాయల వృద్ధాప్య పెన్షన్ కూడా అందుకుంటూ వుండటం బయటపడింది. ఆంధ్రప్రదేశ్లో బోగస్ రేషన్ కార్డులను ఏరివేస్తున్న సందర్భంగా ఈ వివరాలు బయటపడ్డాయి. ఇలాంటి వారు ఎంతోమంది తెల్లకార్డులు పొందారని, వయసు తక్కువ వున్నా, అర్హత లేకపోయినా వృద్ధాప్య పెన్షన్లు కూడా పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే అలాంటి వారిలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి తండ్రి కూడా వుండటం వైసీపీ నాయకుల గొంతులో వెలక్కాయలా మారింది.


