రాయలసీమ గర్జనలో కుప్పకూలిన బైరెడ్డి.. అసలేమైంది?
Published on: Mon Dec 5, 2022 12:09PM
వైసీసీ యూత్ వింగ్ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రాయలసీమ గర్జన సభలో ప్రసంగిస్తూ ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.
దీంతో ప్రసంగాన్ని కొనసాగించడం కష్టమైంది. వెంటనే ఆయన క్షమించాలి అంటూ ప్రసంగాన్ని ముగించి వేదిక దిగిపోయారు. ఆ తరువాత ఆయన కళ్లు తిరిగి పడిపోయారు.
వెంటనే కార్యకర్తలు ఆయనకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అస్వస్థత ఏమిటన్న ఆందోళనలో పార్టీ వర్గాలు ఉన్నాయి. కాగా ఆసుపత్రిలో చికిత్స అనంతరం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు.


