TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్సపై వైసీపీ ఎమ్మెల్యే తిరుగుబాటు!

Published on: Mon Feb 8, 2021 10:21AM

పంచాయతీ ఎన్నికల వేళ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. విజయనగరం జిల్లా వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణపై ఆయన సమీప బంధువు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు తిరుగుబాటు చేశారు.  తన నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు అరాచకాలు ఎక్కువయ్యాయని తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. టీడీపీ నేతలతో కుమ్మకై .. డబ్బులు ఎరవేసి  ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటున్నారని అప్పలనాయుడు మండిపడ్డారు. 

అన్నదమ్ములకి, వదినకి పదవులున్నా సంతృప్తి చెందక బొత్స లక్ష్మణరావు రాజకీయ ఉన్మాదిగా మారారని ఎమ్మెల్యే విమర్శించారు. గత ఎన్నికల్లో తనకు వచ్చిన ముప్పైవేల మెజారిటీ చూసి ఓర్వలేక రాజకీయచిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, రాష్ట్రమంతా ఒకటైతే.. తన నియోజకవర్గంలో మరోలా ఉందన్నారు. బొత్స తన సోదరుడిని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారని, ఎన్నికల తరువాత అధిష్టానంకు పిర్యాదు చేస్తానని, అటో ఇటో తేల్చుకుంటానని అప్పలనాయుడు అన్నారు.