వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా? ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారా?
Published on: Sun Dec 26, 2021 9:44AM
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. జగన్ సర్కార్ నిర్ణయాలతో జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోతుందనే చర్చ సాగుతోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ వైపు పారిశ్రామిక వేత్తలు ఎవరూ చూడటం లేదు. ఏపీ సర్కార్ ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేయడంతో కేంద్ర సర్కార్ కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో దినదినగండంగా ఏపీ ఆర్థికశాఖ పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
జగన్ పాలనపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రాష్ట్రమంతా ప్రస్తుతం రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. గుంతలు లేని రహదారులే కనిపించడం లేదు. నిధులు లేక మరమ్మత్తులు జరగడం లేదు. దీంతో గ్రామాలకు వెళ్లాలంటేనే వైసీపీ ప్రజా ప్రతినిధులు జంకుతున్నారు. వీటికి తోడు కొందరు వైసీపీ నేతల తీరు పార్టీకి తీవ్ర నష్టం కల్గిస్తోంది. కమీషన్ల కోసం అధికారులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఒంగోలులో జరిగిన సుబ్బారావు గుప్తాపై దాడి ఘటన వైసీపీలో అంతర్గతంగానూ అలజడి రేపుతోంది. ఆర్యవైశ్య నేతలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సుబ్బారావు గుప్తా పై జరిగి దాడి ఘటన అధికార వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్య సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది.
సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడిని వైసీపీ ఎమ్మెల్యే బహిరంగంగానే తప్పు పట్టారు. అంతేకాదు ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. కేవలం వైశ్య కమ్యూనిటి అనే భావనతోనే గుప్తాపై బాలినేని అనుచరుడు సుభాని దాడికి పాల్పడ్డారని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు విమర్శించారు. వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోతుందని హితవు పలికిన నేరానికి గుప్తా దాడి చేయడం హేమనీయమని ఖండించారు. ఇది యావత్తు వైశ్య సామాజిక వర్గాన్ని కలతకు గురిచేసిందని వివరించారు. సుభాని మంత్రి బాలినేనిపై ఉన్న స్వామి భక్తితో చేశాడా? లేకుంటే తాను నాయకుడిగా ఎదుగడానికి గుప్తాపై దాడికి పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ పరువును కాపాడుకొని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు తీసుకురావాలనే గుప్తా హితవు పలికాడే తప్పా .. ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఎమ్మెల్యే రాంబాబు సమర్థించారు. దాడి చేస్తే సరిపోదని, ఆ తరువాత న్యాయస్థానం, చట్టాల ముందు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
త్వరలో గిద్దలూరు రాజకీయ పరిస్థితులపై సీఎం జగన్ ను కలిసి వివరించడంతోపాటు, సుబ్బారావు గుప్తా పై జరిగిన దాడిని కూడా వివరిస్తానని రాంబాబు చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ ను కలిసొచ్చిన తరువాత సంచలన వార్త ఒకటి మీరు వింటారని మీడియాకు రాంబాబు లీకులిస్తున్నాడు. ఈ లీకులే ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. అన్నా రాంబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని, వైసీపీ నుంచి బయటికి వచ్చేస్తారనే ప్రచారం జరుగుతోంజి. సీఎం జగన్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు. అన్నా రాంబాబు కూడా చాలా కాలంగా సీఎంను కలవాలని అనుకుంటున్నారు. కానీ చాన్స్ దొరకడం లేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మరో వైపు గిద్దలూరులో వైసీపీలోని రెడ్డి సామాజికవర్గం మొత్తం రాంబాబుకు వ్యతిరేకంగా ఏకమైందట. ఈ సారి రాంబాబుకు టిక్కెట్ ఇస్తే పని చేయబోమని చెబుతున్నారట. ఈ పరిణామాలతో రాంబాబు అసహనంగా ఉన్నారని, తన అసంతృప్తిని ఇలా బ.టి
మరోవైపు అన్నా రాంబాబు ఒక్కరే కాదు.. చాలా మంది వైసీపీ నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగిపోవడంతో.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని చాలా మంది వైసీపీ నేతలు డిసైడయ్యారని తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారని చెబుతున్నారు.ఇందులో భాగంగానే సుబ్బారావు గుప్తాపై జరిగిన దాడి ఘటనపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్రంగా స్పందించారని అంటున్నారు. ఇలా ఏదో ఒక కారణం చూపి.. వైసీపీ నుంచి బయటికి రావాలాని చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. దీంతో వైసీపీలో రాబోయే రోజుల్లో సంచలనాలు జరగబోతున్నాయని అంటున్నారు.


