TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ బూమరాంగ్.!

Published on: Fri Jul 10, 2026 11:28AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా యూట్యూబర్ ప్రశ్న రావణ్  అరెస్ట్, ఆ తర్వాత అతనికి విధించిన జ్యుడీషియల్ రిమాండ్ అంశం పెను సంచలనంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో ఉండే ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ఉన్న రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా అసభ్యకరమైన, మతపరమైన విద్వేషాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

అయితే, ఈ అరెస్ట్ ఉదంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పూర్తిగా బెడసికొట్టడమే కాకుండా బూమరాంగ్ అయ్యింది. ఒక విధంగా ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా సాగే బూతుల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతూ ప్రజామోదం పొందితే.. అదే విషయంలో క్షణానికో మాట మార్చిన చందంగా వెసీపీ వేసిన అడుగులు ఆ పార్టీలో స్థిరత్వ లేమినీ, గందరగోళాన్నీ, అయోమయాన్ని వెల్లడి చేసి.. వైపీపీ ప్రతిష్ఠను మసకబార్చింది. 

ప్రశ్న రావణ్ వ్యవహారంలో వైసీపీ తొలి నుంచీ తొందరపాటుగా వ్యవహరించడమే కాకుండా, రోజుకో స్టాండ్ మారుస్తూ ప్రజల ముందు చులకన అయ్యింది.  ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ.. ప్రశ్న రావణ్ గతంలో  వైసీపీ అధినేత జగన్ ను, వైసీపీ విధానాలనూ విమర్శించిన  పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..  ప్రశ్న రావణ్ ను తెలుగుదేశం   మద్దతుదారుడంటూ ప్రచారం చేసింది.  అయితే..  వైసిపి ఆడిన ఈ మైండ్ గేమ్ ఎక్కువ సేపు నిలవలేదు. టిడిపి శ్రేణులు అంతే వేగంగా కౌంటర్ ఇస్తూ, వైసిపి నేతల అసలు రంగును బయటపెట్టారు.

ఇక అక్కడ నుంచీ వైసీపీ ఒకదాని వెంట ఒకటిగా వరుస తప్పిదాలు చేసింది. ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.  ఒకవైపు ప్రశ్న రావణ్‌ను తెలుగుదేశం సానుభూతి పరుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తూనే.. అతడి కుటుంబ సభ్యులు వైసీపీ అధినేత జగన్ ను కలవడం, వారితో భేటీ తరువాత.. జగన్ సోషల్ మీడియా వేదికగా హే రామ్..సేవ్ ఆంధ్రా అంటూ కూటమిపై విమర్శలు గుప్పించి ప్రశ్న రావన్ కు మద్దతుగా నిలవడం జరిగింది. అక్కడితో ఆగకుండా.. ప్రశ్న రావణ్ కు వైసిపి తరఫున పూర్తి లీగల్ సపోర్ట్ అందిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆ పార్టీకి చెందిన సీనియన్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.   

వాస్తవానికి ప్రశ్న రావణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మత విద్వేష పూరిత ప్రచారాల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అతని అరెస్టును సాధారణ ప్రజలు, నెటిజన్లు పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇలాంటి నెగిటివిటీ ఉన్న వ్యక్తి విషయంలో వైసిపి అనుసరించిన ద్వంద్వ వైఖరి ఆ పార్టీకే  నష్టం చేకూర్చింది.  ప్రశ్న రావణ్ విషయంలో   రోజుకో మాట మారుస్తూ.. ఒకరోజు అతను టిడిపి మనిషి అని, మరుసటి రోజే అతనికి జగన్ పూర్తి లీగల్ సపోర్ట్ ఇస్తారని చెప్పడం వైసిపి సోషల్ మీడియా ఎకోసిస్టమ్‌లో ఉన్న గందరగోళం, అయోమయాన్ని బహిర్గతం చేసింది.  

సానుభూతి రాజకీయాల కోసం ఆరాటపడి, సమాజంలో   వ్యతిరేకత ఉన్న వ్యక్తిని వెనకేసుకురావడం ద్వారా వైసిపి తన ప్రతిష్ఠను తానే మసకబార్చుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నాయకులు ప్రశ్న రావణ్ కు మద్దతుగా మాట్లాడిన పాత వీడియోలు బయటకు రావడంతో వైసీపీ ఫౌల్ గేమ్ బహిర్గతమైందనీ,  ఫలితంగా, ఈ సినారియోలో వైసీపీ తనకు ఉన్న అన్ని కార్డులను ప్రయోగించి కూడా అభాసుపాలైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ycp self goal, ys jagan prashna ravan, ambati rambabu press meet, ap political news, Telugu One