TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బజారున పడి కొట్టుకున్న వైసిపియులు.!

Published on: Wed Jul 8, 2026 2:31PM

వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది.  వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు.  మహిళలు జుట్టూజుట్టూ  పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel