TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీని వదిలేశాడని చంపేశారు!

Published on: Mon Aug 19, 2024 10:55AM

మా కార్యకర్తలని చంపేస్తున్నారు అంటూ వైసీపీ నాయకుడు జగన్ నోటికొచ్చిన లెక్కలు చెబుతూ ఢిల్లీ వరకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని నేషనల్ మీడియా వాళ్ళు చనిపోయిన 36 మంది పేర్లు చెప్పమని అడిగితే తప్పించుకున్నప్పుడే అర్థమైపోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నది సాక్షాత్తూ జగన్ పార్టీ నాయకులే. ఇప్పటికే చాలామంది తెలుగుదేశం నాయకులను హత్య చేసిన వైసీపీ నాయకులు ఆదివారం నాడు బీజేపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణంలో ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్న (50) అనే బీజేపీ నాయకుడిని వైసీపీ నాయకులు గొంతు కోసం చంపారు. శేఖన్నకు గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవు. అయితే ఈమధ్య శేఖన్న వైసీపీని విడిచిపెట్టి బీజేపీలో చేరాడు. అది కూడా హత్యకు కారణం కావచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.