నాలుగు బిర్యానీ పాకెట్లతో మీ ఫ్యామిలీ ఖతం.. వైసీపీ నేత అనుచరుల వార్నింగ్..
Published on: Thu Nov 25, 2021 1:40PM
గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ వ్యాపారాని బెదిరించారు. మాజీ ఎంపీ అనుచురల అరాచకం తాజాగా వెలుగు చూసింది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య వివాదం తలెత్తడంతో.. నల్లపాడులోని విద్యుత్ బైక్ షోరూంపై మోదుగుల అనుచరులు దౌర్జన్యానికి దిగారు. సిబ్బందిని కొట్టి షోరూంకు తాళాలు వేశారు. బాధితుడు హరికిషన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు షోరూం తాళాలు తీయించారు.
అయితే ఎస్పీ బదిలీతో మరోసారి షోరూంకు తాళాలు వేశారు మోదుగుల అనుచరులు. తామేమీ చేయలేమని నల్లపాడు పోలీసులు చెబుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.25లక్షలు ఇవ్వాలని మోదుగుల అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. నాలుగు బిర్యానీ పొట్లాలు ఖర్చు చేస్తే మీ కుటుంబం ఉండదని బెదిరింపులకు పాల్పడుతున్నారని.. తనకు రక్షణ కల్పించాలని బాధితుడు హరికిషన్ వేడుకుంటున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.


