విజయవాడ రాజధానా... నేనొప్పుకోనంతే...
Published on: Wed Aug 13, 2014 4:23PM

వైసీపీ నాయకుడు జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని బలంగా కోరుకుంటున్నారు. అదేదో రాయలసీమ ప్రజల మీద ప్రేమతో అలా కోరుకుంటున్నారని అనుకోవద్దు... రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేస్తే అక్కడ తన హవా నడిపించవచ్చన్నది జగన్ ఆలోచన. అందుకే రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గొడవ చేయండంటూ తన పార్టీ నాయకులకు కీ ఇచ్చి వదులుతున్నారు. తాజాగా విజయవాడను ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా ప్రకటించడంతో వైసీపీ రాయలసీమ నాయకులు రంగంలోకి దిగారు. విజయవాడ - గుంటూరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని నడుపుతానని వైసీపీ నాయకుడు భూమా నాగిరెడ్డి హెచ్చరించేశారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రజలు ఆందోళన చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని ఇసుమంత కూడా పట్టించుకోవడం లేదన్నారు. పాపం భూమా వారు చంద్రబాబు నాయుడిది కూడా రాయలసీమేనని మరచిపోయినట్టు్న్నారు. తన ప్రాంతంలోనే రాజధాని ఏర్పాటు చేయాలన్న సంకుచిత భావం చంద్రబాబు లేదన్న విషయాన్ని భూమా నాగిరెడ్డి గుర్తించనట్టున్నారు.


