కుప్పంలో దొంగలు పడ్డారు.. పోలింగ్ లో వైసీపీ అరాచకాలు!
Published on: Mon Nov 15, 2021 11:07AM
టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తంగా సాగుతోంది. విజయం కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు దొంగ ఓట్లు మరోవైపు దౌర్జన్యకాండకు దిగుతున్నారు.
కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. కుప్పంలోకి వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తతలు తలెత్తున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పడం లేదు. టీడీపీ శ్రేణులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వైసీపీ శ్రేణులకు పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అంటున్నారు.
బస్సుల్లో సోదాల పేరుతో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర వైసీపీ బిర్యానీ ప్యాకెట్లు పంచుతోంది. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు. 16, 19 వార్డుల్లో టీడీపీ శ్రేణులు దొంగ ఓటర్లను పట్టుకున్నారు.


