TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోమాతల మరణాలతో వైసీపీ నీచ రాజకీయం!

Published on: Fri Apr 18, 2025 10:04AM

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎన్నెన్ని అపచారాలు జరిగాయో, ఏడు కొండల పవిత్రతను ఎంతగా దిగాజార్చారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇంటి మనిషి  సొంత బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డిని ఒకటికి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించి స్వామి వారి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం మొదలు.. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం వరకు జగన్ రెడ్డి పాలనలో జరగని  పాపం అంటూ ఏదీ లేదు. అవును, టీటీడీ పాపాల పుట్టగా మారింది. అందుకే  వెంకన్న దేవుడు జగన్ రెడ్డిని, ఆయన గారి పార్టీని ఆ విధంగా శిక్షించాడు. అయినా, జగన్ అండ్ కో .. తీరు మారలేదు. టీటీడీ గోశాలలో గోవులు ఆకలి, అనారోగ్యంతో కన్ను మూస్తున్నాయని అసత్య ప్రచారికి తెర తీశారు. ఒక విధంగా, అధికార దాహంతో మహాపచారానికి పాల్పడుతున్నారు.   

నిజానికి  బాబాయ్, అబ్బాయ్.. పాలనలో తిరుమలలో జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అన్య మత ప్రచారం అయితే యథేచ్ఛగా సాగింది. ఒకసారి కాదు.. అనేక సార్లు అన్యమతస్తుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి, అయినా.. ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.  అంతే కాదు.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్నా, అవరోధాలు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఫర్మానాలు జారీ చేసింది. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మతస్తులను గుర్తించి, ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని సంకల్పించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను  జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రికి  బదిలీ చేసింది. అన్యమతస్తులకు అండగా నిలిచింది.

నిజానికి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం  సామాన్యమైనది కాదు . హిందూ దేవాలయాల ధ్వంస రచన లక్ష్యంగా తీసుకున్న వ్యూహాత్మక   నిర్ణయంగా అప్పట్లోనే అధికార వర్గాలు, ముఖ్యంగా మాజీ ఐఎఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్వీ ఆకస్మిక బదిలీని అన్యమతస్తుల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాలి ఉంటుందని అప్పట్లోనే అధికారులు, పదవీ విరమణ చేసిన మాజీ అధికారులు  కొందరు పేర్కొన్నారు.

ఒక్క తిరుమ లలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ దేవాలయంలో అయినా అన్యమత ఉద్యోగుల జోలికి వస్తే  ఖబడ్దార్‌  అని అధికారులను పరోక్షగానే అయినా  ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి హెచ్చరించారని అంటారు.  మరో వంక అన్యమతస్తుల ఏరి వేతకు పూనుకున్నందుకే  చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిపై బదిలీ వేటు వేసిన తర్వాత  మరో అధికారి అలాంటి సాహసం చేయలేరని  అన్యమత ప్రచారం సాగిస్తున్న దేవాలయాల ఉద్యోగులు భరోసా ఇచ్చారు. అందుకే  ఆ తర్వాత ఏ అధికారీ ఆ సాహసం చేయలేదు. మరో వంక రాష్ట్రంలోని అనేక ప్రధాన దేవాలయాల్లో అన్యమత మత ప్రచారానికి అడ్డూ అదపూ లేకుండా  పోయిందని  అప్పట్లో అధికారులే కాదు భక్తులు కూడా ఆందోళన వ్యక్త పరిచారు. 
 ఆ విధంగా జగన్ రెడ్డి ఇచ్చిన భరోసాతోనే  ఆ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రలో ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుని రథాలు తగల బడ్డాయి.  గుళ్ళు కూలిపోయాయి. విగ్రహాల తలలు విరిగి పడ్డాయి. మరోవంక  ప్రభుత్వం అండదండలతో క్రైస్తవులు నామమాత్రంగా అయినా లేని గ్రామాల్లో  విదేశీ సంస్థలు సమకూర్చిన నిధులతో  చర్చిల నిర్మాణం జరిగింది.  అలాగే  కొన్ని కొన్ని చర్చిల నిర్మాణం,మరమత్తులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులనే జగన్ రెడ్డి ప్రభుతం ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి. 

అందుకే  ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి  జగన్ రెడ్డి  ఐదేళ్ల పాలనలో హిందువులు చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. చివరకు రామతీర్థలో రాములవారి శిరస్సు ఖండన వంటి దుర్మార్గ చర్యలకు  ఒడి గట్టినా ప్రభుత్వంపట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక్కరంటే ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ‘పాపం ..పిచ్చోళ్ళు’ అంటూ ధర్మ ద్రోహులకు జగన్ రెడ్డి ప్రభుత్వం  పిచ్చి సర్టిఫికేట్ ఇచ్చి  రక్షణ కవచంగా నిలిచింది.  అందుకే హిందూ ధార్మిక సంస్థలు జగన్ రెడ్డి హిందూ వ్యతిరేక పాలన సాగించారని  ముఖ్యంగా, తిరుమలను పవిత్రతను దిగజార్చే కుట్రలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని అనేక సందర్భాలలో ఆరోపించాయి.  

ముఖ్యంగా వాటికన్ సిటీని మించిన ప్రపంచ ఆద్యాత్మిక కేంద్రంగా తిరుమల ఎదుగుదలను  తట్టుకోలేకనో ఏమో  జగన్ రెడ్డి తమ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో ఏడు కొండల ప్రతిష్టను దిగజార్చేందుకు శత విధాల ప్రయత్నించారని  అంటారు. అయితే.. ఆయన లక్ష్యం నెరవేరలేదు కానీ  దేవుని శిక్ష అయితే తప్పలేదు.  అవును. జగన్ రెడ్డికి అర్థమయ్యే భాషలోనే.. వెంకన్న దేవుడు సమా ధానం ఇచ్చారు. అహంకారంతో ఊగిపోయిన, ఆయన్ని పదకొండు సీట్లకు పడగొట్టి  చూపారని భక్తులు ఇప్పటికీ సంతోషం వ్యక్త పరుస్తున్నారు. 

నిజానికి  వెంకన్న దేవుని ప్రతిష్టను దెబ్బ తీసే కుట్రలు జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు . గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి  ఏడు కొండలను రెండు కొండలకు కుదించి, కొండ పైనే చర్చి నిర్మాణం చేపట్టేదుకు విఫల ప్రయత్నం చేశారు. అయితే  ఆ తర్వాత ఏమి జరిగింది.   అందరికీ తెలిసిందే.  అయినా.. జగన్ రెడ్డి, చేసిందంతా చేసి ఇప్పడు టీటీడీ గోశాలో గోమాతలు చనిపోయిన సంఘటను ఆసరా చేసుకుని, రాజకీయం చేస్తున్నారు. గతంలో అయన హయాంలోనే నాసి రకం దాణా, ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం వలన  గోమాతాల ఆరోగ్యం దెబ్బతిన్నదని విజిలెన్స్  నివేదిక చెప్పిన నిజాన్ని మరిచి పోయి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం  చేస్తున్నారు. 

జగన్ రెడ్డి, తెర చాటు దర్శకత్వంలో భూమన నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం గట్టిగానే  చేస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా.. ఎక్కడైనా గోమాత తనువు చాలించడం ఏ హిందువునైనా బాధిస్తుంది. అయితే  గోమాతల సహజ మరణాలను రాజకీయం చేయడం  తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హిందువులే కాదు.. మనిషన్నవాడు ఎవడూ సమర్ధించడు. నిజానికి  ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కొత్త కాదు. గతంలో వైఎస్  రాజశేఖర రెడ్డి  చెన్నా రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు సృష్టించి, వందల ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్ తో జాగ్రత్త అంటున్నారు.