ఏపీలో రాష్ట్రపతి పాలన.. వైసీపీ డిమాండ్
Published on: Tue Feb 3, 2026 4:09PM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగు రమేష్ నివాసాలపై జరిగిన దాడులను ఆయన పార్లమెంటులో ప్రస్తావించారు.
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడిన పిల్లి ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఏపీలోని చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమపై ఆధారపడి ఉందన్న అహంభావంతో. ఏం చేసినా చెల్లుతుందనే ధోరణితో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అంతకు ముందు పార్లమెంటు ఆవరణలో వైసీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేశారు.


