గోరంట్లపై చర్య విషయంలో వైసీపీ వెనకడుగు?
Published on: Fri Aug 5, 2022 1:35PM
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోర్న్ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంత అడ్డంగా తమ పార్టీ ఎంపీ బుక్ అయినా చర్యలుతీసుకునే విషయంలో వైసీసీ సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. చర్య తీసకోవాలా వద్దా? అంటూ సుదీర్ఘంగా చర్చలు జరుపుతోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీడియా ఎదుట చెప్పారు.
అయితే గోరంట్ల మాధవ్ ఆ వీడియో మార్ఫింగ్ చేశారనీ, అందులో ఉన్నది తాను కాదనీ చెప్పారనీ, ఆ మేరకు ఫిర్యాదు కూడా చేశారని అన్నారు. విచారణ జరిగి గోరంట్ల మాధవ్ దోషిగా తేలితే ఒక రాజకీయ పార్టీగా తాము కచ్చితంగా చర్య తీసుకుంటామని సజ్జల అన్నారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ చైర్మన్ నారాయణ స్వామి కూడా అదే చెబుతున్నారు.
గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ జరుగుతున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై వైసీపీ విచారణ జరిపిస్తోందన్నారు. వీడియో వాస్తవమని తేలితే గోరంట్ల మాధవ్ పై పార్టీ పరంగా కఠిన చర్య తీసుకుంటామని చెప్పారు.


