TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత

Published on: Wed Nov 2, 2022 9:22PM

తీవ్ర అనారోగ్యానికి గురైన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి బుధవారం (నవంబర్ 2) హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

నంద్యాల జిల్లాలోని అవుకులోని తన స్వగృహంలో ఆదివారం చల్లా భగీరథరెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తీవ్ర మైన దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులకు గురైన చల్లా భగీరథరెడ్డిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించి బుధవారం కన్నుమూశారు.

భగీరథరెడ్డి మాజీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి తనయుడు. ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే చల్లా రామకృష్ణారెడ్డి మరణించడంతో ఆయన రాజకీయ వారసుడిగా భగీరథరెడ్డి తెరపైకి వచ్చారు. వైసీపీ ఆయనను తండ్రి స్థానంలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది.