నటుడు యశోసాగర్ అంత్యక్రియలకు స్నేహా ఉల్లాల్
Published on: Thu Dec 20, 2012 5:06PM
.jpg)
గురువారం జరిగిన యువ నటుడు యశోసాగర్ అంతక్రియలకు నటి స్నేహా ఉల్లాల్ హాజరయ్యారు. ముంబయి లో ఉన్న స్నేహా ఉల్లాల్ యశోసాగర్ మరణ వార్త వినగానే షాక్ కి గురైంది. ఈ రోజు బెంగుళూరు వచ్చి యశోసాగర్ అంతక్రియలలో పాల్గొన్నారు.
ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో యశోసాగర్ బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. బెంగళూరు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంత వల్ల యశోసాగర్తో పాటు కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. యశోసాగర్ ప్రముఖ కన్నడ నిర్మాత బి.వి. సోము తనయుడు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు వెళుతూ కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని బోల్తా పడటంతో ఈ దుర్ఘటన జరిగింది.


