ఇంకా దొరకని టిడిపి ఎంఎల్ఏ ?
Published on: Fri Dec 21, 2012 1:03PM
.jpg)
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న తెలుగు దేశం పార్టీ గురజాల ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాస రావు కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారనే పక్కా సమాచారంతో రెండు పోలీస్ బృందాలు నగరంలో గాలిస్తున్నాయి.
ఆయన నగరానికి చేరుకున్న విధానం, ఇందుకు ఆయన సహకరించిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. గత నెల 27 న పిడుగురాళ్ళ వద్ద జరిగిన కాంగ్రెస్ కార్యకర్త నరేంద్ర హత్య కేసులో ఎంఎల్ఏ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఆ హత్య లో ఎంఎల్ఏ ప్రమేయం ఉందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఆయన ఆచూకి తెలియకపోవడంతో, ఆయన ఇద్దరు గన్ మెన్లు జిల్లా ఎస్ పి వద్దకి వెళ్లి జరిగిన విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియచేయడంతో ఆయన పరారీ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు యరపతినేని హైదరాబాద్ లో ఓ పోలీస్ ఉన్నతాధికారి నివాసంలో ఉన్నారని కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.


