సిబిఐ విచారణ కు వెల్కమ్.. సరస్వతి సిమెంట్ భూముల కోసమే కేసులు

గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు కొంత కాలంగా అజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు గుంటూరు టీడీపీ శిబిరం వద్ద ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ సరస్వతి సిమెంట్ భూముల కోసమే తనపై వైసిపి ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు. ప్రస్తుతం పల్నాడులో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, అక్రమ కేసులు,దాడులతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అక్రమ మైనింగ్ విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణను తాను స్వాగతిస్తున్నట్టుగా యరపతినేని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పినట్టుగా 15 ఏళ్ల నుండి మైనింగ్ విషయంలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.