TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యనమలకు అస్వస్థత.. స్టంట్ వేసిన వైద్యులు

Published on: Fri Apr 10, 2026 12:34PM

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. గుండెకు సంబంధించి సమస్యతో ఆయనను హఉటాహుటిన హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రికి గురువారం (ఏప్రిల్ 9) తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యనమల రామకృష్ణుడుకు గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించిన ఉవైద్యులు ఆయనకు  యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్‌ను  అమర్చారు.

  ప్రస్తుతం ఆయన  వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాగా తన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన అవసరం లేదనీ యనమల స్వయంగా ఒక ప్రకటన చేశారు.  గత కొన్ని రోజులుగా  అస్వస్థతతో బాధపడుతున్న తాను  వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు.  

త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో ప్రజా క్షేత్రంలోకి వస్తానని యనమల పేర్కొన్నారు.   ఇలా ఉండగా వైద్యుల సమాచారం మేరకు యనమల కోలుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఆ తరువాతనే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు.