యానాం కర్మాగారం లాకౌట్,చేతులెత్తేసిన చైర్మన్
Published on: Wed Feb 1, 2012 10:30AM
యా
నాం: యానాంలోని రీజెన్సీ సిరామిక్స్ మూతపడింది.సంస్థకు లాకౌట్ ప్రకటిస్తూ యాజమాన్యం ఉదయం ప్రకటన చేసింది. దీంతో కర్మాగారంలో పనిచేస్తున్న 6 వేల మంది కార్మికుల భవితవ్యంపై అంధకారం అలుముకుంది. నష్టాన్ని అంచనా వేసే వరకు కర్మాగారాన్ని తెరిచే అవకాశం ఉండదని యాజమాన్యం చెబుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అది కూడా సాధ్యమయ్యే పరిస్థితి లేదని రీజెన్సీ సిరామిక్స్ చైర్మన్ నాయుడు మాటలను బట్టి అర్థమవుతోంది. సంస్థలను తాను వదిలేసినట్లేనని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితి సాధారణంగా లేదని, తీవ్రమైన భయాందోళనలు నెలకొన్నాయని, అక్కడికి ఎవరూ వెళ్లే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బెదిరిస్తూ ఫోన్లు కూడా వస్తున్నాయని చెబుతున్నారని ఆయన అన్నారు. అక్కడి పరిస్థితి వల్లనే లాకౌట్ ప్రకటించినట్లు ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. దుర్మార్గులు కంపెనీలో చేరి చెడగొట్టారని ఆయన అన్నారు. యానాంలోని కర్మాగారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా భయపడుతున్నారని ఆయన అన్నారు. కర్మాగారంపై దాడి, దానికి సంబంధించిన సంఘటనల్లో బయటివారి పాత్ర ఉందని ఆయన అన్నారు.


