TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రీజెన్సీ నిందితుల గుర్తింపు..ఏక్షణంలో అయినా అరెస్ట్

Published on: Tue Jan 31, 2012 8:06AM

యానాం : యానాంలో రీజెన్సీ సిరామిక్స్ వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ మృతిని హత్యకేసుగా నమోదు చేసినట్లు డీఐజీ శుక్లా తెలిపారు. కాగా నిందితుల్ని గుర్తించామని, ఏక్షణంలో అయినా అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిందితులు స్వయంగా పోలీసులకు లేదా కోర్టులో అయినా లొంగిపోవచ్చని ఆయన సూచించారు. అరెస్ట్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా యానాంలో పరిస్థితి అదుపులో ఉందని జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ తెలిపారు. కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందన్నారు. కార్మికనేత మురళీమోహన్ మృతిపై విచారణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.