త్వరలో వై.ఎస్. హయాంలోని వివాదాస్పద జీవోల రద్దు?
Published on: Sat Jun 2, 2012 11:14AM
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో విడుదలైన జీవోలను నిలుపుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కొత్త జీవోలతో పాత వాటిని రద్దు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. దానిలో భాగంగానే బ్రహ్మణీ స్టీల్స్ తో ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 99ని విడుదల చేసింది. 2007లో వై.ఎస్. ప్రభుత్వం ఈ ఒప్పందం ప్రకారం 14వేల ఎకరాలను బ్రాహ్మణికి కట్టబెట్టింది. ఈ భూములను కూడా వెనక్కి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ జీవోతో పాటు అంటే 2010లో ఒక జీఓ, 2009లో 14జీవోలు, 2008లో 12జీవోలు, 2007లో 4జీవోలు వై.ఎస్. ప్రభుత్వం విడుదల చేసింది మొత్తం 31పైచిలుకు ఉంటాయని అంచనా. అంటే మరో 31 జీవోలతో వీటిని అడ్డుకునేందుకు కిరణ్ సర్కార్ ప్రయత్నిస్తోంది.
అప్పట్లో విడుదలైన జీవోల వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో ఫిబ్రవరి 26న విడుదల చేసిన 12జీవో, 2009 ఫిబ్రవరి 13న విడుదల చేసిన 54వ జీవో. అదేనెలలో మూడోతేదీన విడుదల చేసిన 104జీవో, అదేనెల 26వ తేదీన విడుదల చేసిన 293 జీవో, అదేనెల 19న విడుదల చేసిన 136జీవో, 2009 జనవరి 29న విడుదల చేసిన 25వ జీవో, 2009 ఫిబ్రవరి 26న విడుదల చేసిన 76వ జీవో, 2009జులై 11న విడుదల చేసిన 865 జీవో, అదే ఏడాది ఆగస్టు 12న విడుదల చేసిన 94జీవో, మే 18న విడుదల చేసిన 107జీవో, జులై 31న విడుదల చేసిన 19జీవో, జూన్ 14న విడుదల చేసిన 30జీవో, అదే నెల 24న విడుదల చేసిన 32జీవో, మార్చి 28న విడుదల చేసిన 35జీవో, జులై 7న విడుదల చేసిన 42జీవో వివాదాస్పదమయ్యాయి. 2008లో డిసెంబర్ 4న 1435జీవో, మార్చి 25న 382జీవో, ఆగస్టు 2న 477జీవో, డిసెంబర్ 12న 1490జీవో, మార్చి 29న 91జీవో, జులై 22న విడుదల చేసిన 146జీవో, ఆగస్టు 12న 94జీవో, డిసెంబర్ 8న 321జీవో, సెప్టెంబర్ 15న 1110జీవో, సెప్టెంబర్ 16న 1115జీవో, నవంబర్ 7న 305జీవో, జులై 10న 36జీవో కూడా జగన్ కేసుతో వివాదాస్పదంగా గుర్తింపునందుకున్నాయి. 2007లో ఆగస్టు 2వ తేదీన విడుదల చేసిన 477జీవో, జూన్ 8న విడుదల చేసిన 785జీవో, జూన్ 18మ వాడిద;అ చేసిన 151జీవో, అదే నెల 10న విడుదల చేసిన 152జీవో కూడా అక్రమాస్తుల కేసులో కీలకంయ్యాయి. అందుకే ఈ 31జీవోలను పూర్తిగా చదివి వాటికి వ్యతిరేకంగా ఒకే జీవోను కానీ ప్రత్యామ్నాయంగా మరో 31జీవోలను కానీ విడుదల చేయాలని సిఎం ఉన్నతాదికార్లను ఆదేశించారని తెలుస్తోంది. కొందరు మంత్రులను కూడా ఈ విషయంలో బాధ్యతలు తీసుకోమని ఆయన కోరారని సమాచారం.


