చంచల్‌గూడ చేరిన జగన్‌

 

సమన్యాయం నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వైయస్‌ జగన్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. అయితే ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోవటంతో బుధవారం రాత్రి ఆయన్ను డిశ్చార్జ్‌ చేశారు.

ఆగస్టు 25న చంచల్‌గూడ జైళులో దీక్ష చేపట్టిన జగన్‌ను 29 అర్ధరాత్రి జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తరువాత జగన్‌ ఆరోగ్యం మరింత క్షీణించడం ఉస్మానియా నుంచి 30 అర్థరాత్రి జగన్‌ను నిమ్స్‌కు తరలించారు.

31వ తేది మధ్యాహ్నం వరకు దీక్ష కొనసాగించిన జగన్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో, అధికారుల అనుమతితొ నిమ్స్‌ వైధ్యులు బలవంతంగా జగన్‌కు ఐవి ఫ్లుయిడ్స్‌ ఎక్కించి ఆయన దీక్ష భగ్నం చేశారు. అప్పటినుంచి నిమ్స్‌లోనే చికిత్స పొందుతున్న జగన్‌ బుధవారం రాత్రి డిశ్చార్జి అవ్వటంతో ఆయనను తిరిగి చంచల్‌ గూడ జైలుకు తరలించారు.