Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎక్కడ నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదు.. కేంద్ర మంత్రి జైశంకర్
posted on: May 22, 2025 8:27PM
.webp)
పాకిస్థాన్ సహా ప్రపంచంలో ఏ మూల నక్కినా ఉగ్రవాదులను వదిలే ప్రశక్తే లేదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్ లో పర్యటిస్తున్న జైశంకర్ అక్కడి మీడియాతో మాట్లాడారు. సిందూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్థాన్ తో కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఇసుమంతైనా లేదని కుండబద్దలు కొట్టారు. ట్రంప్ మాటలు పట్టించుకోబోమని ఉద్ఘాటించారు. అలాగే కాశ్మీర్‌పై చర్చల ప్రశ్నేలేదన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని స్సష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్థాన్ తన విధానంగా చేసుకుందనీ, ఈ విషయంపై భారత్ ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోందని వివరించిన జైవంకర్ అలాంటి చర్యలకు తగిన రీతిలో బదులిచ్చే హక్కు భారత్‌కు ఉందని అన్నారు. .
ఏప్రిల్ 22 నాటి ఘటనలు పునరావృతమైతే, కచ్చితంగా ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా ఉంటుందని పాక్ ను ఆపరేషన్ సిందూర్ ద్వారా హెచ్చరించామని అన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావే లేదనీ, తేల్చి చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమించుకున్న కశ్మీర్ భాగాన్ని ఎప్పుడు ఖాళీ చేస్తారన్న విషయంపై మాత్రమే పాకిస్థాన్ తో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.అంతే కానీ నియంత్రణ రేఖ, జమ్మూకశ్మీర్ పాలనా వ్యవహారాలపై చర్చించే ప్రశ్నే లేదని జైశంకర్ చెప్పారు.
అదలా ఉండగా అంతర్జాతీయంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు భారత్ చేపట్టిన దౌత్య యుద్ధానికి సర్వత్రా సానుకూల స్పందన లభిస్తోంది. ఏడు అఖిల పక్ష బృందాలను ప్రపంచ దేశాల పర్యటనకు పంపింది. యూఏఈ, జపాన్ లకు వెళ్లిన అఖిలపక్ష బృందాలు అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. పాక్ దుశ్చర్యలు వివరించారు. ఉగ్రవాదంపై భారత్ పోరుకు యూఏఈ, జపాన్ లు పూర్తి మద్దతు ప్రకటించడమే కాకుండా భారత్ పై ప్రశంసల వర్షం కురిపించాయీ నుంచి పూర్తి మద్దతు లభిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.


.webp)
.webp)


