Latest News

మంకీ పాక్స్ రూపంలో మరో ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ..

posted on: Jun 16, 2022 11:58AM

కోవిడ్ ముప్పు నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదు. ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలనే తమ తమ దేశాల ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతలోనే మరో ముప్పు తరుముకు వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.

అదీ వైరస్సే.. అత్యంత వేగంగా వ్యాపించే మహమ్మారే. ప్రాణ నష్టం అధికంగా ఉండకపోయినా.. ప్రస్తుతం యూరోప్ దేశాలలో విపరీతంగా వ్యాపిస్తున్న ఆ వైరస్ కు ప్రస్తుతం ఉన్న పేరు మంకీ ఫాక్స్.  యూరోప్ దేశాలలో అత్యధికంగా వ్యాపిస్తున్నఈ వైరస్ ఇప్పటి వరకూ 39 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1600 మందికి ఈ వ్యాధి సోకింది.

మరో అంత మందిలొ ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయి.  అయితే నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ వ్యాప్తి తీవ్రత ఇలాగే కొనసాగితే.. కోవిడ్ లాగే ఇది కూడా ప్రపంచాన్ని కమ్మేయడానికి ఎక్కువ రోజులు పట్టదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు ప్రాంతాల పేర్లు, జంతువుల పేర్లు వైరస్ లకు, వ్యాధులకు పెట్టడం నిషేధం. దాంతో మంకీ ఫాక్స్ గా పిలవబడుతున్న వైరస్ పేరు మార్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కసరత్తు చేస్తున్నది.

అంతకంటే ముందు మంకీ ఫాక్స్ వైరస్ వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరాన్నిపరిశీలిస్తున్నది. అందుకోసం డబ్ల్యుహెచ్ ఓ ఈ నెల 22 ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంకీ ఫ్యాక్స్ వ్యాప్తి తీవ్రత, మరిన్ని దేశాలకు విస్తరించే ముప్పు, ప్రభావిత దేశాలలో పరిస్థితులు తదితర అంశాలపై చర్చించి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనపై ఒక నిర్ణయం తీసుకునే అవకావం ఉంది. స్పష్టమైన హేతుబద్ధమైన ఆధారాలు లేనప్పటికీ ఈ వైరస్ మూలం ఆఫ్రికా దేశాల నుంచే ఆరంభమైందనీ శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఆ దిశగా పరిశీలనలు సైతం చేస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...