అమరావతికి వరల్డ్ బ్యాంక్ హ్యండిచ్చింది కేంద్ర ప్రభుత్వం వల్లనేనట....అందుకేనా ?

 

ఏపీ రాజధాని అమరావతికి  ప్రపంచ బ్యాంకు రుణం నిలిపివేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఏపీ రాజధాని నిర్మాణానికి 300 మిలియన్ డాలర్ల రుణ ప్రతిపాదన విరమించుకున్నట్టు వరల్డ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. అయితే అలా ఎందుకు ఆపామో ప్రకటించక ముందే ఈ విషయం మీద రాజకీయంగా దుమారం రేగి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రపంచ బ్యాంకు రుణం విషయంలో వెనక్కు తగ్గిందని టీడీపీ ఆరోపించింది. 

మరోపక్క గత ప్రభుత్వ తీరువలన విసిగిపోయి నందువలనే ప్రపంచ  బ్యాంకు ఋణం ఇవ్వడం లేదని వైసీపీ కౌంటరిచ్చింది. అయితే ఎన్ని రాజకీయ ఆరోపణలు చేసుకున్నా ప్రపంచ బ్యాంక్ సహకారం లేకుండా అమరావతి నిర్మించడం దాదాపు అసాధ్యం, అందుకే ఈ విషయం మీద ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులని వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో అంతగా ఆసక్తి చూపలేదని, కేంద్ర ప్రభుత్వం సూచనతోనే అమరావతికి ఆర్థికసాయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. 

అమరావతి సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని అందుకే తాము తప్పుకున్నామని తెలిపింది. అయితే రుణ సాయం చేయలేకపోయినప్పటికీ ఏపీలో ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగాల్లో ఒక బిలియన్ డాలర్ల రుణ సాయం యధావిధిగా కొనసాగుతోందని పేర్కొంది. వినూత్నమైన ఆలోచనలతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారని స్వయం సహాయక బృందాలు వంటి సరికొత్త ఆలోచనతో దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఏపీ కితాబిచ్చిన్న వరల్డ్ బ్యాంక్ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరితే తప్పకుండా సాయం చేస్తామని స్పష్టత ఇచ్చింది.  

అయితే కేంద్రం వ్యవహరిచిన తీరు మీద విమర్శలు వస్తున్నాయి. ఏపీతో తమకు అవసరం లేదు కాబట్టే  సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ బీజేపీవాదుల వాదన మరోలా ఉంది, అదేంటంటే ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ చేసి నిధులు ఇస్తామని అన్నదని అలంటి సంప్రదాయాన్ని అలవాటు చేస్తే అన్ని చోట్ల అలాగే ఇన్స్పెక్షన్ లు చేస్తారని అందుకే వద్ద్దని కేంద్రం పేర్కొందని అంటున్నారు. అయితే ఎటువంటి అవినీతికి పాల్పడకుండా ప్రపంచ బ్యాంకు ఋణం ద్వారా కట్టే ప్రాజెక్ట్ లు కడుతున్నట్టు అయితే, ఈ బ్యాంక్ ఇన్స్పెక్షన్ లకి భయపడాల్సింది ఏముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీని మీద కేంద్రం సమాధానం ఏమని చెబుతుందో ? వేచి చూడాలి.