అమరావతిపై ప్రపంచ బ్యాంక్ నిర్ణయం.. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం!

 

ప్రపంచ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలోని అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది. 

Working Group on International Financial Institutions (WGonIFIs) మరియు అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ యొక్క బాధిత సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ప్రజల ఉద్యమాలు, పౌర సమాజ సంస్థల వ్యతిరేకత మరియు ప్రభావిత వర్గాల వారి నుంచి తనిఖీ ప్యానెల్ కి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది.

ఈ విషయంపై నర్మదా బచావ్ ఆందోళన్ మరియు నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ యొక్క సీనియర్ కార్యకర్త మేధా పట్కర్ స్పందించారు. "అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో పాల్గొన్న స్థూల ఉల్లంఘనలను ప్రపంచ బ్యాంక్ గ్రహించి, ఈ నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషంగా ఉంది. నర్మదా మరియు టాటా ముంద్రా తరువాత, ఇది ప్రపంచ బ్యాంక్ గ్రూపుపై సాధించిన మూడవ అతిపెద్ద విజయం. నర్మదా బచావ్ ఆందోళన్ పోరాటం కారణంగా ఏర్పడిన తనిఖీ ప్యానెల్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ప్రజల అనుమతి లేకుండా వారి ఎజెండాను ముందుకు తీసుకురావద్దని మేము ప్రభుత్వం మరియు ఆర్థిక సంస్థలను హెచ్చరిస్తున్నాం" అన్నారు.

అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్ట్ కు 2014 లో శ్రీకారం చుట్టినప్పటి నుండి.. పర్యావరణ నిపుణులు, పౌర సమాజ సంస్థలు మరియు ఉద్యమ సంఘాలు.. పర్యావరణ చట్టాల ఉల్లంఘన, ఆర్థిక అసమర్థత, సారవంతమైన భూమిని భారీగా స్వాధీనం చేసుకోవడంపై తమ ఆవేదన వ్యక్తం చేశాయి. సారవంతమైన వ్యవసాయ భూములు తీసుకోవడం వల్ల జీవనోపాధిని కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసాయి.

రాజధాని ప్రాంత రైతు సమాఖ్యకు చెందిన మల్లెల శేషగిరిరావు మాట్లాడుతూ.. "మా భూమి మరియు జీవనోపాధికి సంబంధించి అనిశ్చితితో మేము ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. ఈ పోరాటం మా జీవితంలో మరచిపోలేని ఒక ముద్ర వేసింది. ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుండి వైదొలగడంతో ఇప్పటికైనా రాష్ట్రం మరియు ఇతర ఫైనాన్షియర్లు అర్డంచేసుకొని.. ప్రజల ఆందోళనలను నిజాయితీ మరియు నిబద్ధతతో పరిష్కరిస్తాయని ఆశిస్తున్నాము." అన్నారు.

ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) యొక్క మరొక సహ-ఫైనాన్షియర్.. తమను తాము పారిస్-పోస్ట్ బ్యాంక్‌గా అంచనా వేస్తూ.. వాతావరణ అత్యవసర పరిస్థితులను పరిష్కరించడానికి నిబద్ధతను సూచిస్తూ, ఇప్పుడు దృష్టి సారించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ వారి అధికారిక పత్రాలలో పరిశీలనలో ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టులో కో-ఫైనాన్షియర్‌గా మాత్రమే ప్రవేశించి.. AIIB ఈ ప్రాజెక్టులో కట్టుబడి ఉండటానికి ప్రపంచ బ్యాంక్ విధానాలను ఉపయోగించింది. అయితే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వైదొలగడంతో సహ-ఫైనాన్షియర్‌గా, ఇప్పుడు AIIB యొక్క స్థితి అస్పష్టంగా ఉంది.

WGonIFIs రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరవల్సినవి:

1. సిఆర్‌డిఎ ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌.. 2013 కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉంది. అమరావతి క్యాపిటల్ రీజియన్‌లోని బాధిత ప్రజలందరి విషయంలో భూసేకరణ మరియు పునరావాస చట్టం, 2013 ను పూర్తిగా అమలు చేసి. అలాగే, ప్రజల నుండి అసంకల్పితంగా తీసుకున్న స్థలాలను ప్రభుత్వం తిరిగి ఇవ్వాలి. 

2. వ్యవసాయం, కార్మికులు, అద్దెదారులు, భూమిలేని కుటుంబాలు, భూసేకరణ మరియు స్థానభ్రంశం ప్రక్రియ కారణంగా తీవ్రమైన ఒత్తిడి మరియు భయానికి గురైన దళితుల సామాజిక-ఆర్థిక నష్టం, భూ లావాదేవీలు అంశాలపై న్యాయ విచారణను ప్రారంభించాలి.

3. గత ఐదేళ్లలో వారి సామాజిక జీవితం చాలా వరకు దెబ్బతిన్నందున దళితులు మరియు భూ యజమానుల కోసం ప్రత్యేక పరిహార ప్యాకేజీని ప్రకటించాలి.

4. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మరియు క్యాపిటల్ రీజియన్ ప్రకటించిన తరువాత కేటాయించిన భూములను కొనుగోలు చేసిన ఇతర వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయాలి.

5. డాక్యుమెంటరీ తారుమారు ద్వారా దళిత రైతులను రికార్డుల నుండి తొలగించే ప్రయత్నాలను ఆపివేసి, 2013 చట్టం ప్రకారం పరిహారం మరియు ఆర్‌అండ్‌ఆర్ ప్రయోజనాల కోసం స్వాధీనం చేసుకున్న భూమికి అసలు యజమానులుగా దళితులని పరిగణించాలి.

ప్రాజెక్ట్ గురించి:

జూన్ 2014 లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తరువాత, కొత్తగా ఏర్పడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు హైదరాబాద్‌ను 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి. 2014 సెప్టెంబరులో, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అమరావతిని ప్రతిపాదిత రాజధాని నగరంగా ప్రకటించారు, దీనిని చాలా సంవత్సరాలు పాటు అభివృద్ధి చేయనున్నారు. 715 మిలియన్ డాలర్ల ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ మరియు AIIB పరిశీలనలో ఉన్నాయి.

రిస్క్ అసెస్‌మెంట్‌లో కూడా, ప్రపంచ బ్యాంక్ సామాజిక మరియు పర్యావరణ ప్రభావాలను సూచిస్తూ ఈ ప్రాజెక్ట్ కి కేటగిరి A ని కేటాయించింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో నగరాన్ని నిర్మించడం, సారవంతమైన వ్యవసాయ భూములు మరియు అడవులను తొలగించడం, సుమారు 20 వేల కుటుంబాలను స్థానభ్రంశం చేయడం, బలవంతంగా భూములు స్వాధీనం చేసుకోవడం మరియు నగర నిర్మాణానికి కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి విషయాల్లో ఈ ప్రాజెక్టుపై విమర్శలు వచ్చాయి. ప్రపంచ బ్యాంకు యొక్క భద్రతా విధానాలను ఉల్లంఘించినందుకు ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయడానికి ప్రపంచ బ్యాంకు యొక్క తనిఖీ ప్యానెల్ కు 2017 లో బాధిత సంఘం ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ప్రక్రియలో ఉంది మరియు తనిఖీ బోర్డు నుండి దర్యాప్తు అర్హతపై సిఫారసు కోసం బ్యాంక్ బోర్డు వేచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టుకు 300 మిలియన్ డాలర్ల రుణాల నుండి వైదొలగాలని నిర్ణయించింది.

మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం నుంచి ప్రపంచబ్యాంకు తప్పుకోవడంపై.. అధికార వైసీపీపై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో అమరావతి నిర్మాణం మీద వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు ప్రపంచబ్యాంకు బృందం అమరావతిని సందర్శించి పూర్తిస్థాయిలో సంతృప్తి చెందడమే కాకుండా మరింతగా ఆర్థికంగా సహాయపడాలని నిర్ణయించింది. కానీ వైసీపీ నేతలు కొందరు రాజ‌ధాని విష‌యంలో కోర్టుల‌కు, గ్రీన్ ట్రిబ్యూన‌ల్ కి కూడా ఫిర్యాదులు చేశారు. వ‌ర‌ద‌ముప్పు, వివిధ పంట‌లు పండించే ప్రాంతం, సామాజిక‌, ప‌ర్యావ‌ర‌ణ కోణంలో జ‌రిగేన‌ష్టం వంటి అంశాల‌ను ముందుకు తీసుకొచ్చారు. అక్కడితో ఆగక ప్ర‌భుత్వం రాజ‌ధాని విష‌యంలో ప్ర‌జాభిప్రాయానికి భిన్నంగా వెళుతుందంటూ రాజ‌ధాని ప్రాంత రైతుల పేరిట కొంద‌రు 2017 మే 25 నాడు ప్ర‌పంచ‌బ్యాంక్ కి ఈమెయిల్స్ పంపి ఫిర్యాదు చేశారు. ఆ విషయాలను గుర్తుచేస్తూ టీడీపీ విమర్శిస్తోంది. ప్రతిపక్షం నుంచి అధికారంలోకీ వచ్చిన వైసీపీ ఇప్పుడు రాజధాని విషయంలో ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి.