TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వరద ప్రవాహంలో యువతి గల్లంతు

Published on: Thu Oct 30, 2025 2:35PM

మొంథా తుపాను ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై  చాలా తీవ్రంగా పడింది. గంటల వ్యవదిలోని భారీ వర్షపాతం నమోదు కావడంతో  వాగులూ, వంకలూ, నదులూ పొంగి పొర్లుతున్నాయి.  జనగామ జిల్లాలో ఎక్కడ చూసినా పొంగిపోర్లుతున్న వాగులూ, జలమయమైన రోడ్లు, ముంపునకు గురైన ప్రాంతాలే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే  బైకుపై మత్తడి దాటేందుకు ప్రయత్నించిన ఓ ప్రేమ జంట బైకుతో సహా వరదలో కొట్టుకుపోయింది.

అయితే ఈ ఘటనలో యువకుడు చెట్టుకొమ్మను పట్టుకుని ప్రాణాలు దక్కించుకోగా, యువతి శ్రావ్య మాత్రం వరద ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘపూర్ మండలం తిమ్మాపూరు శివారులో చోటుచేసుకుంది.  గల్లంతైన యువతి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. గల్లంతైన యువతి హనుమకొండలోని వాగ్దేవీ కాలేజీలో చదువుతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో నివసిస్తుంటారనీ, కుమార్తెను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారనీ సమాచారం.