ఒకే కానుపులో తొమ్మిది మంది పిల్లల జననం
Published on: Fri Dec 23, 2022 10:05AM
కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణం. అత్యంత అరుదుగానై ముగ్గురు లేదా నలుగురు పిల్లకు ఒకే కానుపులో జన్మించిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఓ మహిళ ఏకంగా ఒకే కానుపులో తొమ్మిది మంది పిల్లలకు జన్మ నిచ్చింది. మొరాకోకు చెందిన సీసా అనే మహిళ మహిళ గర్భం దాల్చింది. గర్భం దాల్చిన ఏడున్నర నెలలకు ఆమె ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది.
నెలలు నిండకుండానే ఆమెకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఒక కానుపులో ఇద్దరు పిల్లలు జన్మించడం మామూలే. అరుదుగా ముగ్గురు, నలుగురు పిల్లలు జన్మించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒకే కానుపులో ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనివ్వడం మాత్రం ఇదే మొదటి సారి అంటున్నారు.
ఒకే కానుపులో తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చి సీసీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. సీసీకు జన్మించిన పిల్లలలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా సీసా ఒకే కానుపులో తొమ్మండుగురికి జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించిందనీ, ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కెక్కిందనీ పేర్కొంటూ గిన్నిస్ వరల్డ్ ఇన్ స్టాలో పోస్ట్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది.


