TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. కారణమేమిటంటే?

Published on: Sat Dec 17, 2022 2:30PM

అవిభక్త కవలల గురించి విన్నాం.. జన్యులోపాలతో  వైకల్యంతో జన్మించే శిశువుల గురించీ కన్నాం.. ఒకే కానుపులో నలుగురు శిశువులు జన్మించిన ఘటనలూ అరుదుగానైనా చూశాం. చేతికి ఆరువేళ్లు ఉండటాన్నీ విచిత్రంగా చూశాం. అయితే సికందర్ కాంపూ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జన్మించిన బిడ్డను చూసి అందరూ అచ్చెరువోందుతున్నారు. ఎందుకంటే ఆ బిడ్డకు ఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో ఓ ఆసుపత్రిలో ఆర్తి కుష్వారా అను మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన ఆ బిడ్డను చూసి వైద్యులే ఆశ్చర్య పోయారు. ఆ బిడ్డకుఏకంగా నాలుగు కాళ్లు ఉన్నాయి. ఇలా జన్మించడాన్ని వైద్య పరిభాషలో ischiopagus అంటారని వైద్యులు చెప్పారు.

అరుదుగా   గర్భ ధారణలో కొన్ని పిండాలు అదనంగా ఉంటాయని. ఇలాంటి సందర్భాలలో పిండం రెండు భాగాలవుతుందని.. శిశువు శరీర భాగాలు రెండు చోట్ల అభివృద్ధి చెందుతాయని, ఈ పాప విషయంలో కూడా అదే జరిగిందని వైద్యులు అంటున్నారు. అన్ని పరీక్ష చేసి ఆపరేషన్ ద్వారా   అదనపు రెండు కాళ్లను తొలగిస్తామని చెప్పారు.