వలపు వల.. పెళ్లి ఎర.. 46లక్షలకు కుచ్చుటోపీ!
Published on: Fri Dec 23, 2022 11:06AM
సామాజిక మాధ్యమం ద్వారా పరిచయస్తులను నమ్మి పోసపోవద్దంటూ పోలీసులు ఎంతగా చెబుతున్నా.. మోస పోయిన వారు రోజు రోజుకూ పెరుగుతున్నా.. కొత్తగా మోసపోయే వాళ్లు మోస పోతూనే ఉన్నారు. చేతులు కాలాకా లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే వారు నిండా మునిగి దిక్కు తోచనిస్థితికి వెళుతున్నారు. అటువంటిదే మరో సంఘటన వెలుగులోనికి వచ్చింది.
వలపు వల విసిరి పెళ్లి పేరు చెప్పి ఓ యువకుడిని 46 లక్షల రూపాయలకు ముంచేసిన కిలేడి ఉదంతమిది. చిత్తూరు జిల్లాకు చెందిన అపర్ణ అనే మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన హైదరాబాద్ కు చెందిన యువకుడికి పెళ్లి పేరుతో గాలం వేసింది. తాను మంచి ఆస్తి పరురాలినని అతడిని నమ్మించింది.
ఆస్తి కోర్టు వివాదాల్లో ఉందనీ నమ్మబలికి విడతల వారీగా అతగాడి నుంచి 46లక్షలరూపాయల వరకూ దండుకుంది. ఆ తరువాత ఫేస్ బుక్, ఫోన్ లలో టచ్ లోకి రావడం మానేసింది. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అపర్ణను అరెస్టు చేశారు.


