సీఎం స్టాలిన్ సెక్యూరిటీ టీంలో మహిళా కమెండోలు

posted on: Dec 13, 2022 1:53PM

తమిళనాడు మహిళల సాధికారత దిశగా మరో ముందడుగు వేసింది. అన్ని రంగాలలో మహిళలకు సమప్రాధాన్యత ఇవ్వాలని తమిళనాడు సీఎం చెబుతున్నారు.

ఆ సమ ప్రాధాన్యం దిశలోనే ఇప్పుడు ఆయన సెక్యూరిటీ దళంలో మహిళా కమెండోలకు స్థానం కల్పించారు. ఒక ముఖ్యమంత్రి సెక్యూరిటీ విభాగంలో మహిళా కమెండోలకు స్థానం కల్పించడం బహుశా ఇదే మొదటి సారి.

మహిళా దినోత్సవం సందర్భంగా గత మార్చి 8న తమిళనాట మహిళా కమెండో విభాగాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న 80 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో 9 మందికి సీఎం సెక్యూరిటీ విశాగంలో నియమించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...