ప్రియుడితో కలసి భర్తని చంపేసింది
Published on: Wed Aug 27, 2014 11:55AM
.jpg)
మానవసంబంధాలు మంట కలసిపోయాయి. ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసే సంఘటనలు సమాజంలో అడపాదడపా జరుగుతూనే వున్నాయి. కృష్ణాజిల్లా నందిగామ సమీపంలోని అడవిరావులపాడు గ్రామంలో అలాంటి సంఘటన మరోటి జరిగింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని ఒక మహిళ ప్రియుడితో కలసి భర్తని చంపేసింది. మార్కపూడి ఆశీర్వాదం (30)కి ఆరేళ్ల క్రితం చందర్లపాడు మండలం తుర్లపాడుకు చెందిన వేల్పుల ప్రమీలతో వివాహం జరిగింది. వీరికి మహేశ్వరి (5), సిరిమల్లి (2) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొంత కాలంగా ప్రమీల అదే గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలిసి ఆశీర్వాదం ఆమెను మందలించాడు. ఆశీర్వాదం బతికి ఉంటే తమకు అడ్డుగా ఉంటాడని భావించిన ప్రమీల, వినోద్‌లు సోమవారం అర్థరాత్రి ఊపిరి ఆడకుండా చేసి ఆశీర్వాదాన్ని దారుణంగా హత్య చేశారు. పోలీసులు ప్రమీలను, వినోద్‌ని అదుపులోకి తీసుకున్నారు.


